కేజీకి రూ. 8.. గుండెలు పిండేస్తున్న ఉల్లి రైతు వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

కేజీకి రూ. 8.. గుండెలు పిండేస్తున్న ఉల్లి రైతు వీడియో

November 14, 2019

ఉల్లి ధరల ఘాటు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో కేజీ దర రకాన్నిబట్టి రూ. 60 నుంచి రూ.80 వరకు పలుకుతున్నాయి. ఢిల్లీ, యూపీ తదితర రాష్ట్రాల్లో రూ. 100 మార్కు దాటింది. పంటనష్టం దీనికి కారణమని చెబుతున్నారు. అయితే చేతికొచ్చిన ఎంతోకొంత పంటను మార్కెట్లకు తీసుకొస్తున్న రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఓ రైతుకు కేజీకి రూ. 8 మాత్రమే దక్కింది. 

మహారాష్ట్రలోని అహ‍్మద్‌ నగర్‌కు చెందిన పేద రైతు దీనగాథ ఇది. కూలీలను పెట్టుకుని ఉల్లి పంటను కోయించి తీసుకొచ్చానని, మార్కెట్లో కేజీ రూ. 8కి మాత్రమే కొన్నారని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. ‘కూలీలకు డబ్బులు ఎలా చెల్లించాలి? నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి. ఉల్లి ధర అంత భారీగా పెరిగినా మాకు మాత్రం పెంచరా? ఎందుకీ అన్యాయం’ అని కన్నీరు పెట్టుకున్నారు. రాజకీయ నాయకులు సీఎం సీటు కొట్టాడుకుంటూ, రైతులను గాలికి వదిలేశారని మండిపడ్డారు.