శివసేనకు మద్దతిస్తాం.. కాంగ్రెస్ బంపర్ ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

శివసేనకు మద్దతిస్తాం.. కాంగ్రెస్ బంపర్ ఆఫర్

October 25, 2019

Maharashtra Pcc Chief Open Offer To Shiv Sena
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు సరికొత్త రాజకీయ సమీకరణాలకు వేదికగా మారుతోంది. ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే దానిపై ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎడమొహం పెడమొహంగా ఉండే శివసేనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓపెన్ ఆఫర్ వచ్చింది. బీజేపీతో మిత్ర బంధాన్ని తెంచుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ బాలాసాహేబ్ థోరట్ వెల్లడించారు. సీఎం పదవి అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.

కాగా ఈసారి ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాల్లో విజయం సాధించగా శివసేన 56, కాంగ్రెస్ పార్టీ 44, ఎన్సీపీ 44 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఈసారి ముఖ్యంత్రి పీఠాన్ని 50 – 50గా పంచుకోవాలని శివసేన బీజేపీ ముందు ప్రతిపాధనలు పెట్టింది. అయితే బీజేపీ నుంచి దీనిపై మౌనమే సమాధానంగా వచ్చింది. ఈ సమయంలో కాంగ్రెస్ ఓ అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ఎన్సీపీకి అనుకూలంగా ఓ కథాన్ని కూడా ప్రచురించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీని దగ్గర చేసుకునేందుకు ఉద్దవ్ థాక్రే ఆదిశగా పావులు కదుపుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.