సినిమా షూటింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్ - MicTv.in - Telugu News
mictv telugu

సినిమా షూటింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్

June 1, 2020

Uddhav Thackeray.

సినిమాలు, సీరియల్స్,ఇతర షూటింగ్స్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి యదావిధిగా షూటింగ్స్ చేసుకోవచ్చని ఉత్తర్వులను విడుదల చేసింది.  ముంబై బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు, సినీ ప్రముఖులు ముంబైలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను కలిసి చర్చించారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన నిర్ణయం వెలువడింది. 

సినిమాలు, టెలీ సీరియల్స్, వాణిజ్యప్రకటనలు,ఓటీటీ సీరియల్స్ చిత్రీకరణకు అనుమతిస్తున్నట్లు మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. తాము పేర్కొన్న నిబంధనలు పాటిస్తూ.. షూటింగ్ జరుపుకోవాలని పేర్కొంది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. ఎక్కువ  మంది పాల్గొనకుండా చూసుకోవాలి. షూటింగ్ జరిపే ప్రాంతంలో తప్పనిసరిగా శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. మాస్కులు ధరించి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. దీనితో పాటు ముంబై నగరంలో షూటింగుల మహారాష్ట్ర ఫిలిం థియేటర్ అండ్ కల్చరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుంచి, జిల్లాల్లో అయితే కలెక్టర్ల నుంచి అనుమతి పొందాలని తెలిపింది. దీంతో త్వరలోని కొన్ని సినిమాలను చిత్రీకరించేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.