మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం..బల నిరూపణపై రేపు తీర్పు - MicTv.in - Telugu News
mictv telugu

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం..బల నిరూపణపై రేపు తీర్పు

November 24, 2019

Maharashtra Political Drama In Supreme Court 

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం గవర్నర్ కోష్యారీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. సీఎం దేేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 10.30 గంటలలోగా గవర్నర్‌కు ఇచ్చిన మద్దతులేఖను కోర్టుకు సమర్పించాలని సూచించింది.  

గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. రేపు బలపరీక్షపై తీర్పు ఇస్తామని న్యాయమూర్తులు వెల్లడించారు.కాగా అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ఇస్తూ లేఖ ఇవ్వడంతో గవర్నర్ వారితో హడావిడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. దీన్ని తప్పుబడుతూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. మెజార్టీ ఎమ్మెల్యేలు తమవైపే ఉన్నారని పేర్కొన్నారు. దీంతో రేపటి తీర్పుపై ఆసక్తి నెలకొంది.