Maharashtra: Shocking CCTV visual shows container truck dragging car following crash
mictv telugu

కారును 2 కి.మీ. ఈడ్చుకెళ్లిన కంటైనర్.. ఆ నలుగురూ సేఫ్

September 12, 2022

ఒక కారును కంటైనర్ ఢీ కొట్టింది. అలా ఢీ కొట్టిన కంటైనర్.. ఆ కారును సుమారు రెండు కిలోమటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. అయినా కారులో ఉన్నవారికి ఏమీ కాకపోవడం గమనార్హం. మహారాష్ట్రలోని పూణెకి సమీపంలో ఉన్న శికరపూర్ వద్ద ఆదివారం రాత్రి జరిగిందీ ఘటన. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూణె-అహ్మద్‭నగర్ హైవేపై శనివారం రాత్రి ఒక కంటైనర్ స్పీడుగా వచ్చి ముందుకు వెళ్తున్న కారును ఢీ కొట్టి రెండు కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది.

కారు రోడ్డుకు తాకుతూ పోవడంతో నిప్పు రవ్వలు విరజిమ్మాయి. అవి కారును చుట్టుముట్టాయి. రోడ్డు చుట్టు పక్కల ఉన్నవారు ఆ ఘటనను కళ్లారా చూస్తూ భయాందోళనకు గురయ్యారు. లోపల ఉన్నవారి పరిస్థితిపై ఆందోళన చెందారు. రెండు కిలోమీటర్ల తర్వాత లారీ-కారు ఆగాయి. కారులో ఉన్న నలుగురు వ్యక్తులు క్షేమంగా కారు నుంచి దిగడంతో చూస్తున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రోడ్డు పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.