మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేడు అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో తన బలాన్ని నిరుపించుకున్నారు. ఏక్నాథ్ షండేకు విశ్వాస పరీక్షలో 164 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ఇస్తూ, ఓటేశారు. దీంతో బలపరీక్షలో ఏక్నాథ్ షిండే నెగ్గినట్లు స్పీకర్ రాహుల్ సర్వేకర్ ప్రకటించారు.
తాజాగా మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఎవరు ఊహించని విధంగా మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే నేతృతంలో శివసేన పార్టీ నుంచి 50 మంది ఎమ్మెల్యేల మద్దుతుతో తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ షిండే గతవారం మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, సోమవారం అసెంబ్లీలో నూతన సీఎంగా బలపరీక్షలో తన బలాన్ని నిరుపించుకునే సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే బీజేపీ, శివసేన నేతల ప్రతిపాదన మేరకు స్పీకర్ విశ్వాస పరీక్ష చేపట్టారు.
తొలుత మూజువాణి ఓటు ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ ఓటీంగ్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండేకు మద్దతు ఇవ్వడంతో ఆయనకు 164 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 99 ఓట్లు పడ్డాయి. ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అసెంబ్లీ బలపరీక్ష నెగ్గాలంటే కనీసం 144 ఓట్లు వస్తే చాలు. కానీ, ఏక్నాథ్ షిండే 164 ఓట్లు రావడంతో విశ్వాస పరీక్షలో నెగ్గారు.