Maharashtra: Three of family from Sangli drown at Oman beach
mictv telugu

ఆ రాకాసి అలలకు బలైంది.. భారతీయ కుటుంబమే

July 13, 2022

 

కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో సముద్రపు అలలకు కొందరు వ్యక్తులు కొట్టుకుపోయిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసింది. ఈ సంఘటన దుబాయ్ లోని ఒమన్‌ సముద్ర తీరంలో జరగ్గా.. ఇందులో ముగ్గురు భార‌తీయులు గ‌ల్లంత‌య్యారు. వారిలో తండ్రి, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. వారి ఆచూకీ కోసం స్థానిక పోలీసులు, అధికారులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్ట‌గా, తండ్రి, బాలుడి మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. కూతురి ఆచూకీ ల‌భించ‌లేదు.

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాకు చెందిన శ‌శికాంత్‌ కుటుంబ సభ్యులు బల అయ్యారు. గత 20 ఏండ్లుగా దుబాయ్‌లో మెకానిక‌ల్ ఇంజినీర్‌గా స్థిర‌ప‌డ్డ శశికాంత్.. కుటుంబంలో క‌లిసి ఉంటున్నాడు. అయితే బ‌క్రీద్ రోజు సెల‌వు కావ‌డంతో.. త‌న భార్య సారిక‌, ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి ఒమ‌న్ స‌ముద్ర తీరానికి వెళ్లారు. తీరంలో ఎంజాయ్ చేస్తుండ‌గా రాక‌సి అల‌లు దూసుకొచ్చాయి. దీంతో శ‌శికాంత్‌ ఇద్ద‌రు పిల్ల‌లు శృతి, శ్రేయాస్ అల‌ల ధాటికి కొట్టుకుపోయారు. క‌ళ్ల ముందే త‌న కుమార్తె, కుమారుడు కొట్టుకుపోవ‌డాన్ని చూసిన తండ్రి.. అప్ర‌మ‌త్తమై వారిని కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. కాస్త ముందుకెళ్లడంతో ఆయ‌న కూడా అల‌ల ధాటికి స‌ముద్రంలోకి కొట్టుకుపోయారు. ఒడ్డున ఉన్న భార్య‌, కూతురు మాత్ర‌మే సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ విష‌యాన్ని శ‌శికాంత్ సోద‌రుడు, న్యాయ‌వాది రాజ్ కుమార్ ధ్రువీక‌రించారు.