రసాయన ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. - MicTv.in - Telugu News
mictv telugu

రసాయన ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం..

March 9, 2018

మహారాష్ట్రలోని పాల్‌గఢ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం రాత్రి రామ్‌దేవ్  రసాయన కర్మాగారంలో భారీ పేలుడు జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, 13 మంది గాయపడ్డారు.అగ్నిమాపక సిబ్బంది  వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. పేలుడు శబ్దం కంపెనీ నుంచి దాదాపు పది కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. ఇళ్లు, భవనాలు కంపించాయని పోలీసులు వెల్లడించారు. అయితే పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉందని పాల్‌గఢ్ ఎస్పీ మంజునాథ్ తెలిపారు.