వామ్మో..వామ్మో..ఇదేం పగ..ఇదేం కసి...ధైర్యం ఉంటేనే చదవండి..! - MicTv.in - Telugu News
mictv telugu

వామ్మో..వామ్మో..ఇదేం పగ..ఇదేం కసి…ధైర్యం ఉంటేనే చదవండి..!

July 21, 2017

పగ మనుషుల్ని రాక్షసుల్ని చేస్తుంది. ఎంతకైనా తెగించేలా చేస్తోంది. కసి..మనుషుల్ని కర్కోటకులుగా మార్చేస్తోంది. ఈ సంఘటనను చూస్తే వీటిని మించినోళ్లు ఉన్నారు అనుకోవాల్సిందే. మనుషలు నిజంగా ఇలాగా కూడా ఉంటారా…వామ్మో వామ్మో ఇంత దారుణం ఏంట్రా నాయన.. కోళ్లను, మేకల్ని కూడా ఇలా నరుకరేమో…కానీ టీ తాగొతున్న ఓ రౌడీ షీటర్ ను కసితో పదిమంది నరికి నరికి చంపారు.

అది మహారాష్ట్రలో ధులే ప్రాంతం..ఉదయం 6 గంటల 15 నిమిషాలు..మార్నింగ్ వాక్ కెళ్లిన రౌడీషీటర్ రఫీయుద్దీన్ టీ తాగుదామని స్టాల్ దగ్గర ఆగాడు..ఇంతలో 10 మంది కత్తులతో దూసుకొచ్చారు. రావడం రావడంతోనే కత్తులతో నరకడం మొదలెట్టారు. 27 పోట్లు పొడిచారు. చివరకు రఫీయుద్దీన్ చచ్చాక కూడా ఒకడు.. కసితో నాలుగైదు పోట్లు పొడిచాడు..

ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణమైన లైవ్ మర్డర్ సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు ఏడుగురినీ గుర్తించారు. నిందితుల్లో విలాస్ గోయర్, ఆయన కొడుకులు వీక్కి గోయర్ ,శ్యామ్ గోయర్ ,విజయ్ గోయర్ లతోపాటు రాజేంద్ర దివారే, భీమ దివారే,దడు దివారెలు ఉన్నారు.

హతుడు రఫీయుద్దీన్ పై 35 క్రిమినల్ కేసులు ఉన్నాయి. షిర్డీ, అహ్మద్ నగర్ , మన్మాడ్, ధులే ప్రాంతాల్లో ఇతనిపై మర్డర్ , రేప్ కేసులు నమోదయ్యాయి. విలాస్ గోయల్ , రౌడీషీటర్ రఫీయుద్దీన్ కు మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఈ కక్షలతోనే అతన్ని దారుణంగా హతమార్చారు.