ఈమంత్రి అయ్యగారు...ముక్కోపి..! - MicTv.in - Telugu News
mictv telugu

ఈమంత్రి అయ్యగారు…ముక్కోపి..!

July 4, 2017

చేతిలో పవర్ ఉంటె సాలు…ఎవ్వన్కైనా దమ్కీ ఇయ్యచ్చు, ఆ పవర్ అనేది కష్టపడి సంపాయించుకున్నోల్లకే కాదు..  ఆళ్ల ఇంట్లున్నోళ్లందర్కి వైఫై లెక్కనే ఆన్ ఐతది,నో పాస్ వర్డ్ అడ్డం ఎవడన్నస్తే  ఉత్కుడే,ఇంతకీ ఏం పవర్ అన్కుటున్రా రాజకీయ పవర్.పాపం పదివిలోకచ్చినోళ్లన్న దాన్ని సంపూర్ణంగ వాడుకుంటరో లేదో తెల్వది గనీ…ఆళ్ల ఇంటోళ్లు మాత్రం దానికి పూర్తి న్యాయం జేస్తరు.అస్సలు ముచ్చటేందంటే మహారాష్ట్ర మంత్రి రంజిత్ పాటిల్ తండ్రిగారైన వి ఎన్ పాటిల్ గార్కి ఓ స్కూలుందట,కనీ అదే గల్లీల పోటీగ  ఎవల్దో ఇంకో స్కూలుగుడ ఉందట,

ఎక్కో పోరగాన్లందరు ఆ స్కూళ‌్లకే వొయ్యెవర్కు,పాటిల్ సార్కు ఎక్కల్లేని కోపమచ్చింది,ఎంబట్నే స్కూలు శెకింగ్ జేశే ఆఫీసర్లను తోల్కొని ఆ స్కూల్ మీద్కి దండయాత్ర కోయిండు, అంతేగాదు మా స్కూళ్ల పోరగాన్లు  అసల్కే దిక్కులేరు,అచ్చినోళ్లందర్ని నువ్వే జాయిన్ జేస్కుంటే మా పరిస్ధితేందని ఆడ ఓ ఉద్యోగిని దవుడపొంటి అర్సుకున్నడు,అవుమరి కొట్టాల్సిందే…లేక్పోతే మంత్రిగారి బాబుగారి ఇస్కూల్ అమ్ధాన్కే గండిగొడ్తారు,పాపం ఆళ్లు గుడ బత్కాలె గద….సద్వులు మంచిగ జెప్పో,ఫీజులు తక్కో తీస్కొనో పోరగాన్లందర్ని ఈళ్ల ఇస్కూళ్లకే  రప్పించుకోవడం ఆళ్లు జేశ్న తప్పేగదా,మరి గ పెద్దాయనకు కోపం అచ్చుట్ల తప్పేమున్నది,ఇంకా నయ్యం ఒకల్ను శెంపదెబ్బ కొట్టంగనే పెద్దాయన కోపం సల్లారింది శాంతించిండు, లేకపోతే పోరగాన్లను గుడ కట్టెతోని నాల్గు అర్సుకుంట ఆళ్ల ఇస్కూళ్లకు పట్కపోయెటోడు కావచ్చు.

https://www.youtube.com/watch?v=-IZrr9vJa6U&authuser=0