శివశివా.. మీ తెలివిని కాకులెత్తకపోను..! - MicTv.in - Telugu News
mictv telugu

శివశివా.. మీ తెలివిని కాకులెత్తకపోను..!

February 12, 2018

శివరాత్రి పండగరోజు ఏం చేస్తారు? శివుడికి పూజలు చేసి జాగారం చేస్తారు..! కానీ కొందరుంటారు. శివరాత్రికే కాదు.. ఏ పండగైనా, విషాదమైనాసేరే వారికి తమ ‘బుర్ర’కు పదునుపెట్టడమే పని. ఇప్పుడంతా క్రియెటివిటీ కాలం. జనాన్ని మెప్పించడానికి కొత్తకొత్త ఐడియాలతో షాక్ కొట్టే క్రియేటివీటీ ప్రదర్శిస్తున్నారు.

నాలుగు సినిమా పోస్టర్లన కలిపేసి క్రియేట్ చేసిన ఈ పోస్టర్ చూస్తేనే తెలుస్తోందిగా మహానుభావుల కల్పనా మహత్య్యం. శివరాత్రి సందర్భంగా వెరైటీగా శుభాకాంక్షలు చెప్పడానికి నెటిజ్లన్లు దీన్ని తయారు చేశారు. ఈ మహా.. శివ.. రాత్రి.. శుభాకాంక్షలు.. ఐడియా బాగానే ఉందిగాని, అన్ని పండగలకు ఇలాంటివి దొరుకుతాయా? దొరుకుతాయేమోలెండి.

తెలుగు భాషలోని అన్ని మాటలతో సినిమాలు తీసేస్తున్నారాయె. ఒక వేళ తెలుగులో లేకపోతే ఏ డబ్బింగ్ సినిమా టైటిళ్ల నుంచో, హాలీవుడ్, బాలీవుడ్ టైటిళ్ల నుంచో కొల్లగొట్టేయొచ్చు. అప్పుడు ఉగాది, దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్ నానా పండగలకు ఇలా సినిమా శుభాకాంక్షలు చెప్పేసుకోవచ్చు.