ఐరాసలో ప్రసంగించిన మహాత్మాగాంధీ.. వైరల్ వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

ఐరాసలో ప్రసంగించిన మహాత్మాగాంధీ.. వైరల్ వీడియో

October 1, 2022

భారత జాతిపిత మహాత్మా గాంధీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అభిమానులు ఉన్నారు. ఎన్నో దేశాల్లో ఆయన విగ్రహాలు కొలువుదీరాయి. కొందరు మూర్ఖులు ఏవో కారణాలతో ఆయన విగ్రహాలను ధ్వంసం చేస్తుంటారు. అయితే మానవాళికి ఆయన ఇచ్చిన సందేశం ప్రపంచానికి ఎప్పటికీ శిరోధార్యమే. దీనికి ఉదాహరణ ఈ వీడియోనే. గాంధీ జయంతి సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో ఈసారి ఆసక్తికర కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ అహింసా దినోత్సవంలో గాంధీ తాతే బతికొచ్చి ప్రసంగించాడా ఆన్నట్టు ఆయన హోలోగ్రామ్‌తో ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు.

యునెస్కో మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్(MGIEP) పదో వార్షికోత్సవం దీనికి వేదికైంది. హోలోగ్రామ్ గాంధీగారు.. విద్యపై తన అభిప్రాయాలు చెప్పారు. ‘‘జీవితంలో చదువుకు ముగింపే ఉందు. విద్య ద్వారానే మనిషిలోని మంచిని బయటికి తీసుకురావచ్చు. ఆధ్యాత్మికత కూడా దీనికి దోహదపడాలి,’ అని ఆయన బోధించారు. ఈ హోలోగ్రామ్‌ను హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ డిజిటల్ మ్యూజియం తయారు చేయడం గమనార్హం. గాంధీ తాత నిజానికి ఐరాసలో ఎప్పుడూ మాట్లాడలేదు.