గాంధీ మునిమనవరాలు హల్ చల్… - MicTv.in - Telugu News
mictv telugu

గాంధీ మునిమనవరాలు హల్ చల్…

August 22, 2017


మీకు ఈ  అమ్మాయి ఎవరు తెలుసా? ఏ మోడల్ లేదా ఏదైనా కొత్త మూవీ హీరోయిన్ కావచ్చు అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే. ఈమె ఎవరో కాదు మన జాతిపిత మహాత్మా గాంధీ మునిమనవరాలు..!  నమ్మలేకపోతున్నారా ? కానీ నిజం. ఈమె పేరు మేధా గాంధీ.  మహాత్మా గాంధీ మనవడు కాంతి లాల్ గాంధీ కుమార్తె. గాంధీ చనిపొయిన తరువాత ఆయన కుంటుంబ సభ్యుల్లో కొందరు అమెరికాలో స్థిరపడ్డారు.

 

అమెరికాలోనే పుట్టి పెరిగిన మేధ ప్రస్తుతం అక్కడ డిజేగా పనిచేస్తోంది. ఆ పని చేస్తూనే మరోవైపు షోలు కూడా నిర్వహిస్తోంది. ఆమె ఇటీవల తన స్నేహితులతో కలసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్  అయ్యాయి. అయితే గాంధీ మునిమనవరాలు ఇలాంటి కురచ దుస్తులు దరించడం సబబు కాదని కొందరు నెటిజన్లు కామెంట్లు  చేస్తున్నారు.