బాలీవుడ్ ఎంట్రీపై గట్టి కౌంటర్ ఇచ్చిన మహేష్‌బాబు - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్ ఎంట్రీపై గట్టి కౌంటర్ ఇచ్చిన మహేష్‌బాబు

April 7, 2022

mmmm

హిందీలో డైరెక్టు సినిమా చేసే విషయంలో మహేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో బాలీవుడ్‌కు వెళ్లగలిగే సత్తా తెలుగులో ఒక్క మహేశ్ బాబుకే ఉందనే మాట బాగా వినిపించింది. కానీ, మహేష్ మాత్రం తెలుగులోనే సినిమాలు చేస్తానని ఎప్పుడూ చెప్తూ వచ్చారు. అయినా ఈ విషయంపై ఆయనకు ప్రశ్నలు ఎదురవుతూనే వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ముంబైలో జరిగింది. గురువారం మహేశ్ ఓ యాప్ ప్రారంభోత్సవం సందర్భంగా ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి మీడియా మిత్రులు బాలీవుడ్‌లో మీ ఎంట్రీ ఎప్పుడు అని అడిగారు. దానికి సమాధానంగా ‘హిందీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా బాలీవుడ్‌లో సినిమాలు చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. తెలుగు సినిమాలే పాన్ ఇండియా రేంజులో హిందీలో కూడా రిలీజవుతున్నాయి. ప్రపంచమంతా తెలుగు సినిమాను చూస్తోంది. అలాంటప్పుడు ఎవరైనా తెలుగు సినిమా చేస్తే చాలానుకుంటారు’ అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.