స్టెప్పులేసిన సితార.. నెటిజన్లు ఫిదా - MicTv.in - Telugu News
mictv telugu

స్టెప్పులేసిన సితార.. నెటిజన్లు ఫిదా

August 13, 2019

ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన టాలెంట్‌ను అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ఓ య్యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించి చిన్నారులను ఆకట్టుకునేల  ప్రోగ్రామ్స్ కూడా చేస్తోంది. 

 సితార తాజాగా తన  డ్యాన్స్‌తో అందరి  దృష్టిని తన వైపు తిప్పుకుంది. ‘మహర్షి’ సినిమాలోని ‘పాలపిట్ట’ సాంగ్‌కు స్టెప్పులేసింది. దీన్ని ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. చాలా క్యూట్‌గా డ్యాన్స్ చేశావంటూ అంతా అభినందిస్తున్నారు. కాగా ఇంతకు ముందు కూడా బాహుబలి సినిమాలోని ‘కన్నా నిదురించరా’ పాటకు ఆమె డ్యాన్స్ చేసింది.