నాన్నను తలుచుకొని మహేష్ బాబు ఎమోషనల్.. - MicTv.in - Telugu News
mictv telugu

నాన్నను తలుచుకొని మహేష్ బాబు ఎమోషనల్..

November 27, 2022

ఇటీవల మరణించిన సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మను కుటుంబ సభ్యులు ఆదివారం నిర్వహించారు. హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఘట్టమనేని సన్నిహితులు పాల్గొన్నారు. సంస్కరణ సభలో కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పెద్దకర్మకు హాజరైన అభిమానులకు మహేష్ బాబు భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతర తండ్రి కృష్ణ కోసం మహేష్ బాబు మాట్లాడుతు భావోద్వేగానికి గురయ్యారు.

“నాన్న నాకు ఎన్నో ఇచ్చారు. అలాగే కోట్లాది మంది అభిమానులను ఇచ్చారు. అన్నింటిలో మీ అభిమానం గొప్పది. నాన్న మన గుండెల్లో, మన మధ్యనే ఎప్పటికీ ఉంటారు. మీరందరూ ఇక్కడకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానం, ఆశీస్సులు నాపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.” అంటూ మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు.

2022 సంవత్సరంలో మహేష్ బాబు ముగ్గురు కుటంబ సభ్యులను కోల్పోయిన సంగతి తెలిసిందే. మొదట తన సోదరుడు రమేష్ బాబు చనిపోయారు. ఆ బాధ నుంచి తేరుకునేలోపే మహేష్ తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. ఇటీవల సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ చనివపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈనెల 15వ తేదిన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కృష్ణ తుది శ్వాస విడిచారు. మరుసటి రోజు ఆయన అంత్యక్రియలను . తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. ఫిలిమ్‌ నగర్‌లోని మహాప్రస్థానంలో జరిగిన ఈ అంత్యక్రియలకు సినీ, రాజకీయ ప్రముఖల, భారీగా అభిమానులు తరలి వచ్చారు.