mahesh babu food arrange for fans
mictv telugu

బాధలోను అభిమానులపై మహేష్ ప్రేమ

November 16, 2022

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు పద్మాలయా స్టూడియోస్ నుంచి మహాప్రస్థానం వరకు కృష్ణ అంతిమయాత్ర కొనసాగింది. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు అధిక సంఖ్యలో వచ్చి పడిగాపులు కాశారు. వీరందరినీ దృష్టిలో పెట్టుకోని అంతటి బాధలోను అభిమానులపై ప్రేమను చూపెట్టారు మహేష్. ఫ్యాన్స్ అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ తినేసి వెళ్లాల్సిందిగా మహేష్ చెప్పినట్లు అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. విషాదంలోనూ మహేష్ బాబు అందరి ఆకలి తీర్చారని ఫ్యాన్స్ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు సామాజిక సేవల్లోను ముందుంటారు. మహేష్ హీల్-ఎ-చైల్డ్ పేరుతో స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. ఈ సంస్థ ద్వారా గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం చేసి ఎంతో మంది చిన్నారుల ప్రాణాలను మహేష్ కాపాడుతుంటారు.