మహేశ్ సుఖీభవ! 600 దివ్యాంగులకు పెళ్లి విందు - MicTv.in - Telugu News
mictv telugu

మహేశ్ సుఖీభవ! 600 దివ్యాంగులకు పెళ్లి విందు

February 10, 2018

టాలీవుడ్ సూపర్ హీరో మహేశ్‌ బాబు, నమత్రలకు పెళ్లయి నేటి 13 ఏళ్లు. దీన్ని పురస్కరించుకుని ఈ జంట చేసి పని అందరి మెప్పులూ మెప్పుతోంది. వీరు హైదరాబాద్ దేవ్నార్‌ పాఠశాలలోని 600 మంది దివ్యాంగులకు చక్కని భోజనం పెట్టించారు. అన్నదాతలను చల్లగా చూడాలని దేవుణ్ని ప్రార్థించారు. మహేశ్, నమ్రతలో వారు ఫొటోలు కూడా దిగారు.

చాక్లెట్ బాయ్, నమ్రత 2005లో ప్రేమపెళ్లి చేకున్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు. ఇటీవల ఇండస్ట్రీలో మహేశ్ జోరు కాస్త తగ్గింది. అతడు భరత్‌ అనే నేనుసినిమా షూటింగ్‌లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న  ఈ మీ ఏప్రిల్ 27న విడుదల కానుంది. ఇందులో బాలీవుడ్‌ నటి కైరా అడ్వాణీ.. మహేశ్ తో జట్టుకట్టింది.