సూపర్ స్టార్ మహేశ్ బాబు. మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు. మహేశ్ ఫౌండేషన్ ద్వారా ఆగిపోతున్న ఎందరో చిన్నారుల గుండెల నిలబెట్టారు. ఇఫ్పటికే వేలాదిమంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపారు మహేశ్ బాబు దంపతులు. పిల్లలకు గుండె సంబంధిత సర్జరీలు చేయిస్తూ ప్రాణాలు పోస్తున్నాడు. ఆయన సతీమణి నమ్రత కూడా ఆయన వెన్నంటే ఉంటూ సాయం అందిస్తున్నారు. ఓ వైపు ఇంటి బాధ్యతలు, మరోవైపు పిల్లలను చూసుకుంటూ ఇన్ని పనులు చేస్తున్నారు. ఈ సారి మరో మంచి పనిచేసి దేవుడు అనిపించుకున్నారు.
Namrata Helped Poor Students❤️🙏 pic.twitter.com/aiPtgFtkjq
— Naveen MB Vizag (@NaveenMBVizag) March 8, 2023
ఎంతో తెలివితేటలు ఉండి చదువుకునే స్థోమత లేని పేద విద్యార్థికి సాయం అందించారు. ఓ పేదవిద్యార్థికి చదువుకునేందుకు ఆర్థికంగా సాయం అందించి మరోసారి తమ గొప్ప మనస్సును చాటుకున్నారు. ఉమెన్స్ డే సందర్భంగా ఓ విద్యార్థికి ల్యాప్ టాప్ ను గిఫ్టుగా అందించారు. ఆ విద్యార్థిని ఓవియేషన్ కోర్సు చదువుతుండటంతో ..ఉన్నత చదువులకు ఉపయోగపడేలా ల్యాప్ టాప్ అందించారు. అంతేకాదు చదువు కోసం ఆర్థికంగా సాయం కూడా అందించారు. వారి చేతుల మీదుగా ల్యాప్ అందుకున్న విద్యార్థి ఎంతో ఆనందించింది. మహేష్ ,నమ్రత లకు కృతజ్ఞతలు తెలిపింది. మహేశ్ మరోసారి రియల్ అనిపించుకున్నారని ఫ్యాన్స్ తెగ సంబురపడిపోతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.