'సర్కార్ వారి పాట' నుంచి మహేష్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

‘సర్కార్ వారి పాట’ నుంచి మహేష్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది

August 9, 2020

ఈరోజు టాలీవుడ్ సూప‌ర్ స్టార్‌ మ‌హేష్ బాబు 45వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయ‌న అభిమానుల‌ను థ్రిల్ చేసేలా ‘స‌ర్కారు వారు పాట’ సినిమా మోషన్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. మోషన్ పోస్టర్‌లో మహేష్ బాబు చేయి ఒక రూపాయి కాయిన్ ని పైకి ఎగరవేస్తూ కనపడుతుంది.

 

మహేష్ బాబు 27వ చిత్రంగా రూపొందుతున్న చిత్రానికి పరుశరాం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని  జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుందని తెలుస్తోంది.