'సర్కారు వారి పాట' పాడనున్న మహేష్ బాబు - MicTv.in - Telugu News
mictv telugu

‘సర్కారు వారి పాట’ పాడనున్న మహేష్ బాబు

May 31, 2020

vbndvv

మహేష్ బాబు దర్శకుడు పరుశరాం కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెల్సిందే. ఆ సినిమా పేరు ‘సర్కారు వారి పాట’ అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే పుకార్లను నిజం చేస్తూ మహేష్ బాబు తన తరువాతి సినిమా పేరును ఈరోజు ఉదయం 9 గంటల 9 నిముషాలకు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. టైటిల్ తో పాటు ప్రీలుక్ ను కూడా మహేష్ బాబు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కియారా అద్వానీ నటించనుందని తెలుస్తోదని. వీరిద్దరూ గతంలో ‘భారత్ అనే నేను’ అనే సినిమాలో జతకట్టారు. సరిలేరు నీకెవ్వరు లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వస్తుండడంతో ఈ సినిమా మంచి అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రాన్ని మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూర్చనున్నారు. పీ ఎస్ వినోద్ కెమెరా వర్క్ చేయనున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ చేయనున్నాడు.