గ్యాంగ్‌స్టర్‌గా మహేష్ బాబు..ద్విపాత్రాభియం కూడా - MicTv.in - Telugu News
mictv telugu

గ్యాంగ్‌స్టర్‌గా మహేష్ బాబు..ద్విపాత్రాభియం కూడా

February 6, 2020

ఇటీవల విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే. దీంతో మహేశ్ ప్రస్తుతం షూటింగ్‌ల నుంచి కొంత విరామం తీసుకుని ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్‌లో 

హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. 

అయితే మహేశ్ తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారంటూ ఇటీవల నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వంశీ-మహేశ్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రానున్న సినిమాలో మహేశ్ ద్విపాత్రాభినయంలో నటించనున్నారట. అంతేకాకుండా రజినీకాంత్ నటించిన ‘భాషా’ సినిమాని పోలిన కథగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేశ్ బాబు ఓ గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మహర్షి’ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.