వీడియో : టిక్కెట్ కోసం క్యూలో నిల్చున్న హీరో మహేశ్ బాబు - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : టిక్కెట్ కోసం క్యూలో నిల్చున్న హీరో మహేశ్ బాబు

May 30, 2022

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా టిక్కెట్ కోసం క్యూలో నిలబడ్డారు. ఆయన హీరోగా నటించిన సినిమాకు కాదు. అడవి శేష్ నటించిన మేజర్ సినిమా కోసం. ఎందుకంటే ఆ సినిమాకు మహేశ్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. జూన్ 3న విడుదలవుతున్న మేజర్ సినిమా ప్రమోషన్ కోసం మహేశ్ యూట్యూబర్ నిహారికతో కలిసి ఈ వీడియో రూపొందించారు. మహేశ్‌తో పాటు అడవి శేష్ కూడా ఈ ఫన్నీ వీడియోలో కనిపించారు. ముందుగా క్యూలో నిహారిక ఉండగా, అమె ముందు అడవి శేష్ వచ్చి నిలబడతాడు. నిహారక విసుక్కుని అతనితో గొడవ పడుతుండగా, అంతలో హీరో మహేశ్ బాబు రావడంతో అతడిని చూసి నిహారిక ఆశ్చర్యపోతుంది. కాసేపు మాట్లాడిన అనంతరం నిహారిక మహేశ్‌ని ఫోన్ నంబరు అడగ్గా, అంతలోనే మహేశ్ వెళ్లిపోతాడు. కాగా, మేజర్ ఉన్నిక‌ృష్ణన్ జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అవుతోంది.