Mahesh Babu Phone Call To Adivi Sesh Over Hit 2 Success
mictv telugu

మహేష్ బాబు ఫోన్ కాల్ తో.. అడివి శేష్ కన్నీళ్లు

December 4, 2022

టాలీవుడ్ లో అడివి శేష్ అప్రతిహత జైత్రయాత్ర కొనసాగుతుంది. వరుసగా ఆరు హిట్స్ తో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు శేష్. క్షణం, ఆమీతూమీ, గూఢచారి, ఎవరు, మేజర్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన అడివి శేష్ తాజాగా హిట్ 2తో ఆరవ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. మొన్న శుక్రవారం విడుదలైన ఈ రెండో కేసుకి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్‌ వస్తుండటంతో ఉబ్బితబ్బి పోతున్న అడివి శేష్ ట్విట్టర్‌లో అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ.. హిట్ విజయం తరువాత తనకు మహేష్ బాబు ఫోన్ చేసినట్లు కూడా వెల్లడించాడు. అయితే మహేష్ బాబుకి మరో థ్రిల్లింగ్ మూవీ చేసిపెట్టాలని అభిమాని కోరగా శేష్ బదులిచ్చారు.

‘ఈ రోజు ఉదయమే ఆయనతో చాలా సేపు మాట్లాడా. నా విషయంలో ఆయన గర్వంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. నాకు చాలా సంతోషం వేసింది. ఆయన నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్నందకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆయన అలా అనడతంతో ఆ క్షణం నాకు కన్నీళ్లు వచ్చేసాయి. ఓ బ్రదర్ గా ఎప్పటికీ తోడు ఉంటానని ఆయనకి మాటిచ్చా. హిట్ -2 కోసం ఆశగా ఎదురుచూ స్తున్నా..ఎప్పుడు చూపిస్తావ్ అని అన్నారు. ఆయన అలా అనే సరికి ఎలా రియాక్ట్ కావాలో అర్ధం కాలేదు` అని అన్నారు. ఇక సమంతని సైతం హిట్ ప్రాంఛైసిలో చేర్చుకోవాలని మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకి అడివి శేష్ సమాధానం ఇచ్చాడు. ‘బాదాస్ కాప్’గా మీరు బావుంటారు ఐడియా ఎలా ఉంది సామ్ అంటూ సమంతకి ట్యాగ్ చేసాడు అడివి శేష్. దీనికి సమంత సైతం పాజిటివ్ గా స్పందించింది. HIT విశ్వంలో ‘బాదాస్ కాప్’గా చేరడానికి తాను ఆసక్తిగా ఉన్నట్టు సమంత పేర్కొంది.