Mahesh Babu reaches Vijayawada to immerse his late father krishna's ashes in river Krishna
mictv telugu

కృష్ణ అస్థికలతో విజయవాడకు మహేష్ బాబు

November 21, 2022

గత వారం తుదిశ్వాస విడిచిన దివంగత సూపర్ స్టార్ కృష్ణ అస్తికలను కృష్ణానదిలో నిమజ్జనం చేయనున్నారు. కృష్ణ కుటుంబ సభ్యులు ఆయన అస్తికల్ని కృష్ణానదితో పాటు మిగతా నదుల్లోనూ నిమజ్జనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ముందుగా ఇవాళ కృష్ణానదిలో ఆయన అస్తికలు నిమజ్జనం చేయనున్నారు. విజయవాడ వద్ద కృష్ణానదిలో సూపర్ స్టార్ కృష్ణ అస్తికల్ని కుటుంబ సభ్యులు నిమజ్జనం చేస్తున్నారు. దీనికోసం కృష్ణ తనయుడు మహేష్ బాబుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఈ ఉదయం విజయవాడ వచ్చారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కృష్ణ కుటుంబసభ్యులు.. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకున్నారు. అక్కడి నుంచి కృష్ణానది ఘాట్ కు వెళ్లి అక్కడ అస్తికలు నిమజ్జనం చేయబోతున్నారు. ఇందుకోసం స్దానికంగా కొందరి సాయంతో ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం అనంతరం వీరు తిరిగి హైదరాబాద్ కు బయల్దేరనున్నారు.

మహేశ్ బాబు రాక నేపథ్యంలో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. మహేష్ బాబు వెంట ఆయన బావలు సంజయ్ స్వరూప్, జయదేవ్, సుధీర్ బాబు, చిన్నాన్న ఆదిశేషగిరిరావు, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, మెహర్ రమేష్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ తదితరులు ఉన్నారు. మహేశ్ బాబు రాక నేపథ్యంలో పోలీసులు తగినంత భద్రతను ఏర్పాటు చేశారు. మహేష్ బాబు ఇంట్లో ఒకే ఏడాదిలో మూడు విషాదాలు నెలకొన్నాయి. జనవరిలో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. చాలా కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న రమేష్ బాబు.. జనవరి 8న మృతి చెందారు. ఇక మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి.. 70సంవత్సరాల వయసులో అనారోగ్యంతో సెప్టెంబర్ 28వ తారీఖున మరణించారు. తాజా తండ్రి కృష్ణ మృతితో మహేశ్ దు:ఖ సాగరంలో మునిగిపోయారు.