‘సర్కారు వారి పాట’ ట్రైలర్ .. మహేష్ నోట ‘జగన్’ మాట - MicTv.in - Telugu News
mictv telugu

‘సర్కారు వారి పాట’ ట్రైలర్ .. మహేష్ నోట ‘జగన్’ మాట

May 2, 2022

సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం ట్రైలర్ సోమవారం విడుదలైంది. కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో అభిమానుల సమక్షంలో చిత్ర బృందం ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇందులో మహేష్ బాబు డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. అయితే సీఎం వైఎస్ జగన్ ఎన్నికల్లో వాడిన ఫేమస్ డైలాగ్ ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ మహేశ్ నోట వినడం ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌గా ఉంది. హీరోయిన్ కీర్తి సురేష్ మహేశ్ వద్దకు వచ్చి ‘మీరొక పదివేల డాలర్లు ఇస్తే పరీక్ష ఫీజు కట్టి, మాస్టర్స్‌లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాను’ అడగుతుంది. దానికి సమాధానంగా మహేశ్ పై డైలాగ్ చెప్తాడు. దీనిపై మహేశ్ అభిమానులతో పాటు జగన్ అభిమానులు కూడా ఫుల్ ఖుషీగా ఫీలవుతున్నారు. కాగా, పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. థమన్ సంగీతంలో వచ్చిన పాటలు ఇప్పటికే హిట్ అవడం తెలిసిందే.