సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు అంటే యమా క్రేజ్. వాళ్ళు ఎక్కడ కనిపించినా వదిలిపెట్టరు. ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు అనవసరం ఎగబడి మరీ చూసేస్తారు. దగ్గరికి వెళ్ళి కలిసేందుకు నానా హంగామా చేస్తుంటారు. వాళ్ళకు అసలు పర్శనల్ లైఫే ఉండదు. అందుకే హాయిగా కొన్నాళ్లయినా ఉందామని పైదేశాలకు వెళ్ళిపోతుంటారు వాళ్ళు కూడా. తప్పనిసరి అయి వచ్చారా….అంతే ఇదిగో ఇలా ఉంటుంది పరిస్థితి.
మహేశ్ బాబు హైదరాబాద్ లో బయట కనిపించడం చాలా అరుదే. షూటింగ్స్, ఈవెంట్స్ అయితేనే వస్తాడు. అలాంటిది ఈరోజు మహేశ్ సడెన్ గా హైటెక్ సిటీలో దర్శనమిచ్చాడు. ఎలాంటి హడావుడి లేకుండా తన పని చేసేకుని తాను వెళ్ళిపోయాడు. తన ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కోసం దుర్గం చెరువు దగ్గర ఉన్న ఆఫీస్ కు వచ్చి వెళ్ళాడు. కానీ కొంతమంది ఉంటారు. దేన్నీ వదిలిపెట్టరు. అలా మహేశ్ రావడాన్ని, పని చేసుకోవడాన్ని అన్నింటినీ కెమెరాల్లో బంధించేసారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టేసారు. ఇంకేముంది వాటికి లైకులే లైకులు.
ఈ వీడియో మహేశ్ చాలా క్యాజువల్ గా కనిపించాడు. కొంచెం లాంగ్ హెయిర్ తో, మామూలు టీ షర్ట్ తో సింపుల్గా ఉన్నాడు. ప్రస్తుతం మహేశ్ త్రివిక్రమ్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. దీని షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది.