స్టేజ్‌పై స్టెప్పులేసిన మహేశ్ బాబు.. వీడియో ఇదిగో - MicTv.in - Telugu News
mictv telugu

స్టేజ్‌పై స్టెప్పులేసిన మహేశ్ బాబు.. వీడియో ఇదిగో

May 17, 2022

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కూల్‌గా, స్ట్రిక్ట్‌గా కనిపించే మహేశ్ బాబు ఎవరి బలవంతం లేకుండానే స్టేజ్‌పైకి వచ్చి స్టేప్పులు వేసి అందరినీ అలరించారు. తాజాగా మహేశ్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్ మీట్‌ను కర్నూలు జిల్లాలో ఉన్న ‘యస్‌టిబిటి’ కాలేజ్ గ్రౌండ్స్‌లో సోమవారం నిర్వహించారు.

ఈ క్రమంలో సినిమాలోని ‘మ మ మహేశ’ పాటకు డ్యాన్సర్లు పెర్ఫామ్ చేస్తుండగా, తమన్ స్టేజ్ మీదకు వెళ్లి కాలు కదిపారు. ఇప్పటికే సినిమాలో మ మ మహేశ పాటలో మాస్ స్టేప్పులు వేసి ప్రేక్షకులను ఊపు తెప్పించిన ఆయన.. ఉత్సహంతో తన సీట్లో కూర్చోలేకపోయారు. తనే స్వయంగా స్టేజ్ పైకెక్కి స్టెప్పులేశారు. దర్శకుడితో సహా వీఐపీలు అంతా ఆశ్చర్యపోయారు. కేరింతలు, ఈలలు కొడుతూ అభిమానులు పేపర్లు విసిరారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియో తెగ ట్రెండ్ అవుతోంది.