యంగ్ లుక్‌లో మహేశ్.. ఫ్యాన్స్ ఫిదా - MicTv.in - Telugu News
mictv telugu

యంగ్ లుక్‌లో మహేశ్.. ఫ్యాన్స్ ఫిదా

May 17, 2020

Mahesh Babu

కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లు లేక అందరూ ఇళ్లల్లో కుటుంబాలతో గడుపుతున్నారు. ఇంట్లో ఖాళీగా ఉండలేక కొందరు ఫిట్‌నెస్ మీద శ్రద్ధ పెట్టారు. మరికొందరు వంటలు, ఇల్లు శుభ్రం చేయడాలు వంటి పనులు చేస్తున్నారు. ఇన్నిరోజులు షూటింగులు, ప్రమోషన్లతో బిజీగా ఉన్నవారికి ఊహించని విధంగా ఖాళీ సమయం దొరికింది. దీంతో కుటుంబాలతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ భర్త మహేశ్‌ బాబు, కుమారుడు గౌతమ్, కూతురు సితారలకు సంబంధించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

ఈ ఫోటోలో మహేశ్ బాబు చాలా కూల్‌గా యంగ్‌ లుక్‌లో కనబడుతున్నాడు. రంగు కళ్లజోడు పెట్టుకుని కొడుకుకి అన్నలా మహేశ్ ఇచ్చిన స్టిల్‌కి ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. లాక్‌డౌన్‌తో మహేశ్ మరింత యంగ్‌గా మారిపోయాడని కామెంట్లు చేస్తున్నారు.