ప్రియాంకారెడ్డి హత్య కేసు: మహేష్ బాబు విన్నపం - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియాంకారెడ్డి హత్య కేసు: మహేష్ బాబు విన్నపం

December 1, 2019

 

Mahesh babu01

ప్రియాంక రెడ్డిపై అత్యచారం, హత్య ఘటనపై ఎందరో సెలెబ్రిటీలు స్పందించిన సంగతి తెలిసిందే. చిరంజీవి, అలీ మొదలగువారు నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ ప్రియాంక అనే హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. 

తాజాగా ప్రముఖ నటుడు మహేష్‌బాబు..ప్రియాంక హత్యాచారం స్పందించారు. రోజు రోజుకు ఇలాంటి సంఘటనలు దేశంలో పెరిగిపోతున్నాయని, వీటిపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్, ప్రధాని కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు. చట్టాలను కఠినతరం చేసి సత్వరమే పరిష్కారం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.