Home > Featured > మహేశ్‌ బాబు సినిమాలో ఇష్టం లేని పాత్ర చేశా: ప్రకాష్ రాజ్

మహేశ్‌ బాబు సినిమాలో ఇష్టం లేని పాత్ర చేశా: ప్రకాష్ రాజ్

టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్య్వూలో సంచలన విషయాన్ని బయటపెట్టారు. సినిమా రంగంలో ఆయన ఇంతవరకు పోషించిన పాత్రల గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎలాంటి పాత్ర వేసిన తన నటనతో, హావభావాలతో, డైలాగులతో, ఎమోషన్‌తో ప్రేక్షకులను తెగ మెప్పిస్తారు. అయితే, తన సినిమా కేరీర్ ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటివరకూ ఆయన వేసిన పాత్రలను గురించి ఒకసారి వివరిస్తూ, మహేశ్ బాబు హీరోగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమాలో తాను వేసిన పాత్ర తనకు ఇష్టం లేకుండానే పోషించానని అన్నారు.

"ఏ ఆర్టిస్టుకైనా ఒక్కొక్కసారి తనకు నచ్చని పాత్రలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. నాకు అలాంటి పాత్ర ఒకటి వచ్చింది. అదే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నేను అబద్ధాలాడే ఒక రాజకీయ నాయకుడి పాత్రను చేశాను. నిజం చెప్పాలంటే ఆ పాత్ర నేను అయిష్టంగానే చేశాను. ఎందుకంటే కొన్నిసార్లు మన నిర్ణయాలతో, అభిప్రాయాలతో పనిలేకుండా అలా జరిగిపోతుంది అంతే. మహేశ్ బాబు హీరోగా చేసిన ఆ సినిమాలో నేను అలాంటి పాత్రను చేయడం నాకు అసంతృప్తిగా అనిపించినా, ఆయన నిర్మించిన 'మేజర్' సినిమాలోని పాత్ర మాత్రం నాకు చాలా చాలా సంతృప్తినిచ్చింది. నా కెరియర్లో 'ఆకాశమంత', 'బొమ్మరిల్లు' సినిమాలు నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి" అని ఆయన అన్నారు.

Updated : 18 July 2022 2:44 AM GMT
Tags:    
Next Story
Share it
Top