Mahesh Babu's emotional post on father Superstar Krishna's death
mictv telugu

ఇప్పుడు నాకు ఎలాంటి భయం లేదు – మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్

November 24, 2022

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణంచిన నేపథ్యంలో ఆయన కుమారుడు ఇప్పటి సూపర్ స్టార్ మహేశ్ బాబు తొలిసారి స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘నాన్నా మీ జీవితం గొప్పగా సాగింది. మీ జన్మను చరితార్ధం చేసుకున్నారు. మీ నిష్క్రమణ కూడా అంతే వైభవంగా జరిగింది. మీ జీవితాన్ని మీరు నిర్భయంగా జీవించారు. మీరు డేరింగ్ అండ్ డాషింగ్. నా స్పూర్తి, గుండె ధైర్యం అన్నీ మీతోనే పోయాయని అనుకున్నాను. కానీ విచిత్రంగా మునుపెన్నడూ లేనంత కొత్త శక్తి నాలో కలిగింది. ఇప్పుడు నాకు ఎలాంటి భయం లేదు. మీ దివ్యజ్యోతి నాలో ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటుంది. మీ వారసత్వాన్ని కొనసాగిస్తా. మీరు గర్వపడేలా చేస్తా. లవ్ యూ నాన్నా.. మై సూపర్ స్టార్’ అని రాసుకొచ్చారు.