Mahesh Babu's Mother Indira Devi Passes Away Due to Ill Health
mictv telugu

మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూత

September 28, 2022

 

ప్రముఖ హీరో మ‌హేష్ బాబు ఇంట విషాదం నెల‌కొంది. ఆయ‌న అమ్మ‌గారైన శ్రీమ‌తి ఇందిరా దేవి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో హైద‌రాబాద్‌లో ఏఐజీ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న ఇందిరా దేవి.. పరిస్థితి విషమించి బుధవారం ఉదయం మరణించారు.

సీనియర్ హీరో కృష్ణ మొద‌టి భార్య ఇందిరా దేవి. వీరికి ముగ్గురు అమ్మాయిలు.. ప‌ద్మ‌, మంజుల‌, ఇందిరా ప్రియ‌ద‌ర్శిని. ఇద్ద‌రు కొడుకులు.. ర‌మేష్ బాబు, మ‌హేష్ బాబు. మ‌ద‌ర్స్ డే, మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భాల్లో మ‌హేష్ త‌న త‌ల్లి గురించి ప్ర‌త్యేకంగా పోస్టులు పెట్టి త‌న ప్రేమ‌ను చాటుకునేవారు. రీసెంట్‌గా ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబంలో ర‌మేష్ బాబు చ‌నిపోయారు. ఇప్పుడు ఇందిరా దేవి కూడా చ‌నిపోవ‌టం ఎంతో బాధాక‌రం.

ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆమె పార్థివ దేహాన్ని పద్మాలయా స్టూడియోలో అభిమానులు సందర్శన కోసం ఉంచుతారు. ఆ తర్వాత మహా ప్రస్థానంలో అంత్య క్రియలను నిర్వహించనున్నారు. కృష్ణ రెండో భార్య అయిన నటి, దర్శకురాలు విజయ నిర్మల కూడా 2019లో అనారోగ్యంతోనే కన్నుమూసిన సంగతి తెలిసిందే.