సినిమాల్లోకి మహేష్ బాబు మేనల్లుడు - MicTv.in - Telugu News
mictv telugu

సినిమాల్లోకి మహేష్ బాబు మేనల్లుడు

November 10, 2019

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో నటుడు తెలుగు వెండితెరపై తెరంగేట్రం చేయబోతున్నాడు. మహేష్ బాబు పెద్ద బావ, గుంటూరు లోక్‌సభ ఎంపీ గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ కథానాయకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను ఈరోజు లాంఛ్ చేశారు. రామ్ చరణ్ క్లాప్ కొట్టగా.. రానా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, గల్లా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. 

భలే మంచి రోజు, శమంతక మణి, దేవదాస్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అశోక్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ చత్రం కోసం ఆమె భారీగా పారితోషకం తీసుకుందని టాక్. అమర్‌ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈమె మహేష్ బాబుకు పెద్దక్క.. ఈ సినిమాలో సీనియర్ నరేష్, సత్య, అర్చన సౌందర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. భిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.