Home > Featured > టీనేజ్ వచ్చేసింది ఎంజాయ్ చెయ్.. 

టీనేజ్ వచ్చేసింది ఎంజాయ్ చెయ్.. 

‘పదమూడో పుట్టినరోజు జరుపుకుంటున్న గౌతమ్‌కు శుభాకాంక్షలు. నువ్వు అధికారికంగా ఓ యుక్త వయస్కుడివి అయ్యావు. నీ ఈ కౌమార దశను సరదాగా, అడ్వెంచర్స్‌తో సెలబ్రేట్‌ చేసుకోవాలి’ అంటూ మహేష్‌ బాబు ట్వీట్‌ చేశాడు. నేడు మహేష్ బాబు కుమారుడు గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ ఈ ట్వీట్ చేశాడు. దీంతో చాలామంది మహేష్ అభిమానులు గౌతమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు తల్లి నమ్రతా శిరోద్కర్ కూడా తన గారాలపట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు ట్విటర్ వేదికగా తెలిపారు.

సోషల్‌ మీడియాలో​ మహేష్‌ బాబుకు ఎంత ఫాలోయింగ్‌ ఉందో.. కుమారుడు గౌతమ్‌, కుమార్తె సితారలకు కూడా అంతే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. సితార ఇప్పటికే ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా చిన్న చిన్ని ప్లేగేమ్స్ వీడియోలు పోస్ట్ చేస్తోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తెతో కలిసి సితార ఈ వీడియోలను చేసి చాలా పాపులర్ అయింది. గౌతమ్ కూడా తండ్రిలా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అదికూడా తండ్రి నటించిన ‘వన్’ సినిమాలో నటించాడు. కాగా, మరికొన్నేళ్లు గడిస్తే గౌతమ్ కూడా కుర్ర హీరోగా వెండితెరపై దర్శనం ఇస్తాడని మహేష్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Updated : 31 Aug 2019 10:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top