తెలుగు స్టార్ల సిన్మల బిజినెస్ లెక్కల గురించి ఎంత చెప్పినా తక్కువే. పెద్ద హీరోలు అయితే ఒకటి తర్వాత సున్నాలు పెట్టుకోవడం మీ వంతు అన్నట్లుంది పరిస్థితి. బ్రహ్మోత్సవం మూవీతో కాస్త డీలా పడినా మహేష్ ’ స్పైడర్’ తో మంచి స్పీడ్ తో వస్తున్నారని ఫీలిం ఇండస్ట్రీలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
మహేష్ ’ స్పైడర్ ’ ఏకంగా 150 కోట్ల రూపాయల బిజినెస్ ఇప్పుడే చేసిందట. శాటిలైట్ హక్కులు… పంపిణీ హక్కులు అన్నీ కలిపితే వచ్చిన అమౌంట్ అదని అంటున్నారు. అతడు సిన్మా తర్వాత ’శ్రీమంతుడు’ మహేష్ ఇమేజ్ ను మరో రూపంలో పెంచింది. అయితే మహేష్ బాబు సిన్మా అనడంతో ఖచ్చితంగా జనం చూస్తారు. భారీ నష్టాల ప్రమాదం లేక పోయినా ఓ మోస్తారు పిక్చర్ అయినా ఫర్వా లేదనే స్థాయిలో వసూళ్లు ఉంటాయి. గజినీ లాంటి సూపర్ హిట్ సిన్మా తీసిన మురుగదాస్ డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి స్పైడర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.