సర్కారు వారి పాట చిత్రం విజయం సాధించడంతో సూపర్ స్టార్ మహేశ్ బాబు హ్యాపీగా ఉన్నారు. ఇదే కంటిన్యూటిలో ఫ్యామిలితో కలిసి అమెరికాలో విహరిస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడి న్యూయార్క్ సిటీలో తన భార్య నమ్రతతో కలిసి ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను కలిశాడు. ఈ ఫోటోను స్వయంగా పోస్ట్ చేసిన మహేశ్.. ‘బిల్ గేట్స్‌ను కలవడం ఆనందంగా ఉంది. ప్రపంచ విజనరీల్లో ఆయన ఒకరు. అంతకంటే ఆయన వినయం నాకు బాగా నచ్చింది. నిజంగా ఆయన ప్రయాణం అందరికీ స్పూర్తి’ అంటూ రాసుకొచ్చారు. మరో రెండ్రోజుల్లో ఇండియాకు రానున్న మహేశ్, బిల్ గేట్స్‌ను కలవడం వెనుక ఆంతర్యమేంటి? అని కొందరు చర్చించుకుంటున్నారు. కొందరేమో వ్యాపారం గురించి ఏమైనా చర్చించి ఉండవచ్చని ఊహాగానాలు వెలువరిస్తున్నారు. ఏది ఏమైనా మన స్టార్ హీరో అంతటి స్థాయి వ్యక్తిని కలవడం మనకు గర్వకారణమే కదా. ఇదిలా ఉంటే, త్వరలో మహేశ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఆ తర్వాత రాజమౌళి సినిమా పట్టాలెక్కనుంది.