సొంత చానల్ పెట్టిన మహేశ్ కూతురు - MicTv.in - Telugu News
mictv telugu

సొంత చానల్ పెట్టిన మహేశ్ కూతురు

July 18, 2019

ప్రిన్స్ మహేశ్ బాబు గారాలపట్టి సితార కూడా రంగంలోకి వచ్చేసింది. ఆమె యూట్యూబ్ చానల్ మొదలు పెట్టింది. తన స్నేహితురాలు, దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య ఇద్దరూ ఇందులో పార్టనర్స్ అన్నమాట. ఏ అండ్ ఎస్ (A&S) పేరుతో ఈ చానల్‌ను ప్రారంభించారు. ఇప్పటి వరకు సితార పాడిన పాటలు, చేసిన అల్లరి అంతా సోషల్ మీడియా పేజ్‌లకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇప్పటినుంచి అవన్నీ యూట్యూబ్ చానల్లో రానున్నాయి. ఇప్పటికే తొలి వీడియోను ఈరోజు పోస్ట్ చేశారు. వీవ్స్ అర లక్ష దాటాయి. 

ఈ వీడియోలో సితార, ఆద్యాలు 3 మార్కర్స్‌ చాలెంజ్‌ ప్లే చేశారు. బొమ్మలకు కలర్స్‌ ఫిల్ చేయటంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. సితార, ఆద్యాల వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో మహేష్ పోస్ట్ చేశారు. ఇద్దరు చిన్నారులకు శుభాకాంక్షలు చెప్పారు.