బిగ్ బాస్ హౌజ్ నుండి మహేష్ కత్తి ఔట్ ! - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్ బాస్ హౌజ్ నుండి మహేష్ కత్తి ఔట్ !

August 12, 2017

బిగ్ బాస్ షో నుండి మహేష్ కత్తి ఎలిమినేట్ అయ్యారు. తొలుత నుండి బిగ్ బాస్ పెట్టిన టాస్కుల్లో పకడ్బందీగా ఆడి చక్కటి పర్ ఫార్మెన్స్ చూపిన మహేష్ కత్తి మీద ఈవారం కత్తి వేటు పడింది. జూనియర్ ఎన్ టిఆర్ వచ్చి మహేష్ కత్తి పేరు అనౌన్స్ చెయ్యగానే టీవీలకు అతుక్కుపోయిన ప్రేక్షకుల్లో ఉత్కంఠకు తెర దిగింది.

జ్యోతి, మధుప్రియ, సమీర్ తర్వాత మహేష్ కత్తి ఎలిమినేటింగ్ వంతొచ్చింది. సంపూర్ణేష్ బాబు తనకుతానే బిగ్ బాస్ హౌజ్ నుండి వెళ్ళిపోవడంతో అతని స్థానంలో దీక్ష వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ కంటెస్టెంట్స్ గా కత్తి కార్తీక, హరితేజ, కల్పన, శివబాలాజీ, ముమైత్ ఖాన్, ఆదర్శ్, అర్చన, దీక్షా, ధన్ రాజ్, ప్రిన్స్ వున్నారు. తొలుతలో మహేష్ కత్తిని బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు పంపినట్టే పంపుతున్నట్టు మళ్ళీ లోపలికి పంపారు. హౌజ్ లో తను వంట చెయ్యాల్సి వచ్చినప్పుడు వంట చెయ్యకుండా తప్పించుకున్నాడని హౌజ్ మెట్స్ అతని మీద నారాజ్ గా వున్నారు. బహుశా పర్ ఫార్మెన్సే అతని ఎలిమినేటింగ్ కు కారణమా అనుకుంటున్నారు బిగ్ బాస్ అభిమానులు.