కత్తిపై కారాలు మిరాయాలు నూరడం దేనికీ... - MicTv.in - Telugu News
mictv telugu

కత్తిపై కారాలు మిరాయాలు నూరడం దేనికీ…

August 31, 2017

సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై పవన్ కళ్యాణ్  ఫ్యాన్స్ కత్తి నూరుతున్నారు.  కత్తి మాట్లాడిన ప్రతి మాటకూ కౌంటర్ ఇస్తున్నారు. కొందరు మాట్లాడుతున్న మాటలు చూస్తే వార్నాయనో పిచ్చి పీక్ స్టేజీల్  ఉందన్పించక మానదు. సిన్మా హీరోకు ఫ్యాన్స్ ఉండొచ్చు.  సేవా కార్యక్రమాలూ చేసుకోవచ్చు.  పది మంది చేత గుడ్ అన్పించుకుని తమ హిరో స్థాయిని మరింత  పెంచి అదనపు గ్లామర్ అద్దితే ఇంకా బావుంటుంది.

ఉన్నదున్నట్లు అంటే ఉలికి పిట్టకు కోపం అన్నట్లు. ఓ విమర్శకుడు తన యాంగీల్ లో విమర్శలు చేస్తాడు. శ్రీశ్రీ అన్నట్లు బజార్లోకి వస్తే ఎన్నైనా అంటం…. ఏమైనావిమర్శ చేస్తం.  ఆ మాత్రం ఓపిక లేని వాళ్ల నాయకుడు ఇంత పెద్ద సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నాడు. భిన్న మనస్తత్వాల, కులాల సమూహ  సమాజాన్ని ఎట్లా ఏకం చేస్తాడు. ఇలాంటి వారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని పది మందీ  నవ్వుకునేలా చేస్తున్నారనే విమర్శను పీకే ఫ్యాన్స్ ఎదుర్కొంటున్నారు. ముందు ముందు  పద్దతి మారకుంటే ఇంకా  పబ్లిక్ లో పల్చనై మరింత చులకనై… తమ హిరోను పరువును మరింత కిందకు మరింత కిందకు దిగజార్చడం ఖాయం.

అయినా మహేష్ ఏమన్నాడని ఇంతలా ఎగిరి పడుతున్నారు. కత్తిపై కారాయాలు మిరాయాలు కలిపి నూరుతున్నారు. పవన్ కళ్యాణ్ సిన్మాల మాట ఎట్లా ఉన్నా రాజకీయాల్లో ఓ స్టాండ్ లేదు. క్లారిటీ ఇవ్వాలి… వస్తాడో రాడో చెప్పాలి. ఏం చేస్తాడో ఎట్లాచేస్తాడో చెప్పాలనే  మాటలనే అన్నాడు. ఇందులో తప్పు లేదు కదా. ఎంత నెటిజన్లు అయినా  విషయం తెలుసుకోకుండా…. అర్థం చేసుకోకుండా నోరుంది కదా అని పారేసుకుంటామని అంటే ఎట్లా. అల్లరి పెడితే… నోరుందని వార్నింగ్ లు ఇస్తే సిన్మా ఫెల్ కాక తప్పదు.

మీరు స్పందించాలంటే దేశం అంతా సమస్యలే  ఉన్నాయి. వాటి గురించి ప్రశ్నించండి. ఉద్దానం లాంటి ప్రాంతాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి  గుర్తించండి.  అమ్మాయిలను ప్రేమ పేరుతో వేధిస్తున్న వారిని అడ్డుకోండి. నిరుద్యోగులకు ఆదుకునేందుకు పరిశ్రమలు పెట్టండి… లేదా పెట్టించండి… అదీ కాదంటే నోర్మూసుకుని కూచోండి. అంతే కాని  పీకే విమర్శ చేస్తే అంతు చూస్తామని హెచ్చరికలు చేస్తూ ఎన్నికల్లో సీట్లు దక్కించుకోవడం కాదు కనీసం  డిపాజిట్లు కూడా రావు.

ఆయన గురించి మాట్లాడేంత మోనగడివా అంటున్నారు… నిజం మాట్లాడేందుకు మగాడు… మోనగాడే అవసరం లేదు. మనిషైతే చాలు. అవతల దాన్ని రిసీవ్ చేసుకునే వాళ్లు మనుష్యులైతే ఇంకా మేలు. అయినా కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్నట్లు… పవన్ కు లేని బాధ మీకెందుకో. పార్టీ పెట్టిన ఆయన బాగానే ఉన్నాడు.రాజకీయాల్లో విమర్శలు సహజం అని ఆయకూ తెల్సు. మీరే కాస్త ఎక్కువ ఎగిరి పడుతున్నట్లుంది కాస్త చెక్ చేసుకోండి.

గతంలో  పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం ఈ దేశానికి దౌర్భాగం అని అప్పట్ల బిజెపీ సీనియర్ నాయకొలరన్నారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ మంచి గా కల్సిపోయారు. రాజకీయాల్లో ఇవన్నీ సహజమే. గతంలో చిరంజీవి విషయంలోనూ విమర్శలు చేసిన వారిపై వెంటపడి వేధించారు… సాధించారు రాజకీయాల్లో చిరు ఉనికే  లేకుండా కావడానికీ ఫ్యాన్సూ ఓ కారణం అయ్యారు. అన్నకు చేసిన అన్యాయమే తమ్మునికే చేయోద్దు ఫ్యాన్స్. మీ ఫ్యాన్స్ సంఘాల్లో  బాగా చదువుకున్న వాళ్లూ ఉన్నారు. రాజకీయాలను ఎంతో కొంత అర్థం చేసుకున్న వాళ్లూ  ఉన్నారు. ఈ చిన్న లాజిక్ మిస్స్ అయితే ఎట్లా.

పవన్ కళ్యాణ్ సిన్మాలు తీయకుండా… రాజకీయాల గురించి మాట్లాడకుండా ఉండే ఆయన గురించి ఎవరు పట్టించుకుంటారు. ఎవరు విమర్శలు చేస్తారు. విమర్శలు చేస్తే భరించ లేని వారు రాజకీయాలు మాట్లాడొద్దు. అలాంటి వారి అభిమానులు అస్సలు  మాట్లాడొద్దు. బజార్లకొచ్చినంక వంద అంటం పడాలే. పడక పోతే మూసుకోని కూసుకోవాలే. అంతే తప్ప… అంతు చూస్తం… ఆగం చేస్తే అంటే కుదరదు.

అయినా రాజకీయాలు నడపటం…క్వాలిటీ  సీటిజన్లను తయారు చేయడం కత్తిమీద సాము లాంటిది. ఒక కత్తి చేసిన విమర్శనే మీరు తట్టుకోక పోతే ఓరాజకీయ పార్టీగా ఎట్లా  జీవనం సాగిస్తారు.  సిన్మవాళ్ల ఉండే ఫైట్లు….. ప్రేమాభిమానులు రియల్ లైఫ్ లో అప్లయ్ చేయాలని చూడకండి. మీకే నష్టం. ఈ విషయం కూడా మీకు అర్థం అవుతుందో  లేదో.  అవుతుందని అనుకోవడం అత్యాశే అవుతుంది.

మీరిట్లాగే చేసి   అప్పుడో ఇప్పుడో సిన్మా చేసుకుని  నాలుగు రాజకీయాలు మాట్లాడుకుంటున్న పవన్ బాబుకు  లేని కష్టం తెచ్చి ఆయన నెత్తి మీద వేసేట్లున్నారు. చేతిలో సెల్లుంది కదా అని సొల్లంతా వాగి  యూట్యూబ్ లో పోస్టు చేస్తే ఓనాలుగు  లైకులు.. మీకు తగ్గ  మైండ్ సెట్ ఉన్న వాళ్లు మెచ్చుకుంటే మీకు ఖుషేనే  కావొచ్చు. అస్సలు నష్టం పవన్ బాబుకే.

వంద మంది మాట్లాడినా.. వేయి మంది ఖండించినా…. లక్ష మంది కారాయాలు మిరాయాలు నూరినా… కోటి మంది నెత్తి నోరు వాచిపోయేటట్లు వాగినా అరిచి గీ పెట్టినా… గింజుకున్న… వాస్తవం అబద్దం అయి పోదు. అందుకే వాస్తవాలు గర్తించండి… విమర్శ చేస్తే అందులోని సహేతుకతను గమనించండి. ఆ తర్వాత స్పందించండి. మంచి ఫ్యాన్స్ గా పేరు తెచ్చుకోండి. ఇంత చెప్పినా మా పద్దతి మార్చుకోం అంటే… అది బురద అటు వెళ్లకు అంటే ఆహా… అందులో ఈత కొడ్తామంటే మీ ఇష్టం.

కత్తి మహేష్ విమర్శకునిగా విమర్శ చేశాడు.రాశాడు. మీకు చేతనైతే మీరు రాయండి. ఎట్లా ఆయన విమర్శ తప్పో మీరు మాట్లాడి మంచిగా చెప్పండి. వీలైతే ఓ సభ పెట్టి మరీ చెప్పండి. అదీ కాదంటే పవన్ బాబుతో ఓ స్టేట్ మెంట్ ఇప్పించండి. అంతేకాని ఇట్లా అల్లర, చిల్లర పనులు చేయడం మంచిది కాదు.  అయినా పవన్ బాబు మీరు కూడా ఎందుకు స్పందించడం లేదు. కాటమరాయుడు కాస్త ఇటు వైపు చూసి నీ ఫ్యాన్స్ ను కాస్త కూల్ చేయండి సార్. లేక పోతే వివాదం మరింత ముదిరితే మీరు వినమ్ర సమాధానం ఇచ్చుకోక తప్పదు. ప్రశ్నిస్తామని చెప్పిన పవన్ బాబు ఫ్యాన్స్ ప్రశ్నించడాన్ని జీర్ణించుకోవడం లేదు. ముందు  పవన్ సారుకు చెప్పండి సార్ మీరు ఎవర్నీ ప్రశ్నించొద్దని. ఆ తర్వాత మిగతా వాళ్ల సంగతి చూద్దాం.

అసురాసుర