mahesh ntr naga chaitanya memorable pic going viral in social media
mictv telugu

అయోమయంలో ముగ్గురు మొనగాళ్లు కలయిక

November 16, 2022

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ.. ఇండస్ట్రీకి ఈ ముగ్గురు మూడు కళ్ళ లాంటోళ్ళు. చెన్నై నుండి చిత్ర పరిశ్రమ హైదరాబద్ కి తరలివచ్చేలా చేసిన మహానుబావులు. ఎన్నో మరుపురాని వందల సినిమాలని మనకి అందించిన గొప్ప నటులు. అయితే మొన్నటివరకు ఆ తరం ఆనవాలుగా సూపర్ స్టార్ కృష్ణ ఉండేవారు. కానీ కృష్ణ మరణంతో ఆ తరం అంతా అంతరించినట్టయింది. దాంతో ‘టాలీవుడ్ ఎరా ఎండ్స్ ‘ అని నెటిజన్స్ సంతాపం తెలియజేస్తున్నారు. అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలు కలిసున్న ఫోటో ఒకటి పెట్టి రాస్తున్న ఈ కొటేషన్ వైరల్ అవుతుంది. అదే సందర్భంలో ఆ ముగ్గురి వారసులు కలిసున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వారే మహేష్ బాబు, ఎన్టీఆర్, నాగచైతన్యలు ఒకే దెగ్గర కలిసి కూర్చున్న ఫోటో.

కృష్ణని కడసారి చూసి.. మహేష్ బాబుని ఓదారుస్తున్న సందర్భంలో అనుకోకుండా ఎన్టీఆర్, నాగ చైతన్యలు ఒకేసారి మహేష్ బాబు దెగ్గరికి రావటం.. పక్కపక్కనే కూర్చోవటం జరిగింది. ఆ సందర్భంగా మహేష్, తారక్, చైతు కలిసి కూర్చున్న ఫోటోతో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ఫోటోలని జతచేసి పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్ పై మిశ్రమ స్పందన వస్తుంది. ఈ ముగ్గురు మొనగాళ్లు కలిసి సినిమా చేస్తే చూద్దాం అనుకున్నాం కానీ ఇలాంటి పరిస్థితుల్లో కలిసి దిగిన ఫోటో చూస్తాం అనుకోలేదు అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ కలయికలో అయితే చాలామంది అభిమానులు తమ హీరోలతో కలిసి చూడాలి అనుకున్నారు కానీ ఇలాంటి సందర్భాల్లో చూడాలి అనుకోలేదని వాపోతున్నారు. అయితే అలనాటి తారలు సూపర్ స్టార్ కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు,నందమూరి తారక రామారావులా మహేష్, ఎన్టీఆర్, చైతుల కాంబో వస్తే బావుంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.