Mahesh Plexis set up about AP politics
mictv telugu

‘మేమేరా మిమ్మల్ని ఆపేది’ హాట్ టాపిక్ గా మారిన మహేశ్ ప్లెక్సీలు

January 9, 2023

Mahesh Plexis set up about AP politics

సూపర్ స్టార్ మహేశ్ బాబు అత్యధిక ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ హీరో. పాలిటిక్స్ కి దూరంగా ఉంటే కేవలం తన సినిమాలు మాత్రమే చూసుకుంటాడు. షూటింగులు లేకుంటే ఫ్యామిలీతో విదేశాలకు చెక్కేస్తాడు. ఇంతవరకు ఒక్క రాజకీయ స్టేట్ మెంట్ కూడా ఇవ్వకుండా క్లీన్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే రాజకీయాలకు ఇంత దూరం మొయింటైన్ చేసే మహేశ్ బాబును కొందరు ఏపీ రాజకీయాల్లోకి లాగుతున్నారు.

ఏపీలో రాజకీయాలకు, తెలుగు సినిమాకు అవినాభావ సంబంధం ఉంది. కొందరు సినీ నటులు రాజకీయాల్లో రంగప్రవేశం చేయగా, కొందరు సక్సెస్ అయితే మరికొందరు ఫెయిలయ్యారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు ఫోటోతో వెలిసిన ఓ ప్లెక్సీ హాట్ టాపిక్ గా మారింది. మహేశ్ ఫోటో కింద ‘మేమేరా మిమ్మల్ని ఆపేది’ అని రాసి ఉన్న ప్లెక్సీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది జనసేనకు, పవన్ కల్యాణ్ కి వ్యతిరేకంగా ఉందని, కావాలనే ఈ ప్లెక్సీ ఏర్పాటు చేశారనే టాక్ వినిపిస్తోంది.

వైసీపీకి, వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా పవన్, జనసేనలు ‘ఎవడ్రా మనల్ని ఆపేది’ అనే స్టోగన్ తో ప్లెక్సీలు, పోస్టులు పెట్టడం, దాని పేరుమీద చిన్నపాటి యాత్రలు చేయడం తెలిసిందే. దానికి కౌంటర్ గా ఈ ప్లెక్సీ ఏర్పాటు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని వైసీపీ తనకు అనుకూలంగా మలచుకుంటోంది. మేమేరా మిమ్మల్ని ఆపేది అని రాసి ఉన్న ప్లెక్సీని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం దానికి బలం చేకూరుస్తోంది. ‘మహేశ్ బాబు గారి ఫ్యాన్స్ వాళ్లని ఆపడం కోసం అంత బ్యానర్ కట్టాలా? గాజువాకలో తిప్పిరెడ్డి, భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ ఉన్నారు కదా. కాదూ కూడదు అని గోల చేస్తే అసెంబ్లీ గేట్ దగ్గర గేట్ బాయ్ గోపాల్ ఎలానూ ఉన్నాడు మెడ పట్టి గెంటేయడానికి’ అని పోస్ట్ కి జత చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్, పోస్టర్ వైరల్ అవుతోంది.