maheshbabu daughter sitara emotional post on krishna death
mictv telugu

తాతను తల్చుకుంటూ సితార ఎమోషనల్ పోస్ట్

November 16, 2022

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నారు. 2022లో ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయిన ఘట్టమనేని కుటుంబ సభ్యుల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది.

ఇక మహేష్ బాబు కుమార్తె, కుమారుడికి తన నానమ్మ అంజనాదేవి, తాతయ్య కృష్ణ లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల మహేష్ తల్లి అంజనాదేవి చనిపోయిన సమయంలో సితార ఎక్కిఎక్కి ఏడ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కృష్ణ మరణంతో తాతయ్యను తలచుకుంటూ ఎమోషనల్ అయ్యింది. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగ మెసేజ్‌ను పోస్ట్ చేసింది.

” ఇక ప్ర‌తి వీకెండ్ లంచ్ మునుప‌టిలా ఉండ‌దు. మీరు నాకెన్నో విలువైన విష‌యాల‌ను నేర్పించారు. న‌న్ను సంతోషంగా ఉండేలా చూసుకున్నారు. ఇప్పుడు అవ‌న్నీ మీకు సంబంధించిన జ్ఞాప‌కాలుగా మారిపోయాయి. మీరే నా హీరో. ఏదో ఒక‌రోజు మిమ్మ‌ల్ని గ‌ర్వ‌ప‌డేలా చేస్తాను. తాత‌గారు మిమ్మ‌ల్ని మిస్ అవుతున్నాను’’ అని ఎమోషనల్ మెసేజ్‌ను షేర్ చేసింది సితార.