మహేశ్ ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ రిలీజ్ - MicTv.in - Telugu News
mictv telugu

మహేశ్ ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ రిలీజ్

April 23, 2022

 

సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం టైటిల్ సాంగును చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. తమన్ సంగీతం అందించిన ఈ పాటను రచయిత అనంత్ శ్రీరామ్ రాశారు. హారిక నారాయణ పాడిన ఈ పాటలో మహేశ్ మాస్ స్టైల్ ఆకట్టుకుంటోంది. బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో వస్తున్న ఈ సర్కారు వారి పాట సినిమా మే 12న రిలీజవుతోంది. 14రీల్స్, జీఎంబీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేశ్‌కు జోడీగా మహానటి కీర్తి సురేశ్ నటిస్తోంది.