బండి కొనండి, డబ్బులు ఏడాదయ్యాక కట్టండి..మహీంద్రా ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

బండి కొనండి, డబ్బులు ఏడాదయ్యాక కట్టండి..మహీంద్రా ఆఫర్

May 20, 2020

mahi

లాక్‌డౌన్ దెబ్బతో అన్ని రంగాలు పూర్తిగా కుదేలయ్యాయి. చాలా మంది చేతిలో డబ్బులు లేకపోవడంతో ఖర్చు చేసేందుకు వెనకా ముందు అవుతున్నారు. ఈ క్రమంలో వాహన తయారీ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీన్ని అదిగమించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా అదిరిపోయే ఆఫర్లను వినియోగదారులకు ప్రకటించింది. కొత్త రకం ఫైనాన్స్ స్కీములను ప్రకటించి వాహనాలను అమ్ముకునే ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా ఎవరైనా వాహనాలు తీసుకుంటే వెంటనే డబ్బులు చెల్లించాల్సిన పనిలేదని, ఏడాది తర్వాత కూడా కట్టవచ్చని పేర్కొంది. 

ఈ స్కీంలో పోలీసులు,వైద్యులు, సామాన్యుల కోసం ప్రత్యేక ఆఫర్లను పొందుపరిచారు. డాక్టర్లు వాహనం కొనాలనుకుంటే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే రుణం ఇస్తామని ప్రకటించింది. దీంతో పాటు మూడు నెలల మారటోరియం కూడా ఇస్తామని తెలిపింది. అదే సాధారణ వినియోగదారులైతే ఏడాది తర్వాతి నుంచి ఈఎంఐ చెల్లించవచ్చు. మహిళలు వాహనం కొనుగోలు చేస్తే 0.1 శాతం వడ్డీకే రుణం అందిస్తామని ప్రకటించింది.