మీరు కొత్తకారు కొనుగోలు చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారా. అయితే ఇది ఖచ్చితంగా మీకు బ్యాడ్ న్యూసే. ఎందుకో తెలుసా. కార్ల ధరలకు రెక్కలు వచ్చాయి. అమాంతం పెరిగిపోయి. వెయ్యి, పదివేలు కాదు..ఏకంగా లక్ష రూపాయల వరకు పెరిగాయి. ముఖ్యంగా దిగ్గజ వాహన తయారుదారు సంస్థల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ..లేటెస్టుగా కార్ల ధరలను భారీగా పెంచింది. ఏకంగా రూ. లక్షవరకు పెంచేసేంది. దీం కొత్త సంవత్సరంలో కారు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది భారీ షాక్ అని చెప్పాలి.
మహీంద్ర అండ్ మహీంద్రా తాజాగా తన పాపులర్ SUVస్కార్పియో ఎన్ ధరను భారీగా పెంచింది. రేట్ల పెరుగుదల కారణంగా వినియోగదారులు ఇప్పుడు స్కార్పియోను కొనుగోలు చేయాలంటే జంకుతున్నారు. ఎందుకంటే 15 వేల నుంచి లక్షల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఈ ధరలు వేరియంట్ ను బట్టి మారుతాయని కంపెనీ తెలిపింది.
ఈ మహీంద్రా స్కార్పియో రెండు ఇంజన్లతో వస్తుంది. 2.2 లీటర్ డిజిల్ ఒక ఇంజన్ కాగా…2 లీటర్ టర్బో పెట్రోల్ తో మరో ఇంజన్ ఉంది. ఈ రెండు కార్లలోనూ 6స్పీడ్ మ్యానువల్ లేదా ఆటోమెటిక్ గేర్ బాక్స్ కూడా ఉంటుంది. నచ్చిన వేరియంట్ ను మీరు కొనుగోలు చేసుకోవచ్చు. 8 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, డ్యూయెల్ జోన్ క్లైమెట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాలు, వైర్ లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఇక ఈ జెడ్ 8 4 డబ్ల్యూడీ వేరియంట్ పై గరిష్టంగా 1.01 లక్షల వరకు రేటు పెరిగింది. ఇంతకుముందు ఈ కారు 19.94లక్షలు ఉండేది. ఇప్పుడు ఈ కారును కొనుగోలు చేయాలంటే 20. 95లక్షలు చెల్లించాల్సిందే. అంతేకాదు మహీంద్రా స్కార్పియోలో టాప్ వేరియంట్ ను కొనుగోలు చేయాలంటే 24.08లక్షలు వెచ్చించాల్సిందే. ఈ కారు ధర అంతగా పెరగలేదు.