మహీంద్రా థార్ దేశంలో అత్యంత ఇష్టపడే SUVల్లో ఒకటి. దాని సెకండ్ జెన్ మోడల్ వల్ల మరింత దీని క్రేజ్ పెరిగింది. మరి దీని వెనుక ఒక మహిళ హస్తం ఉంది. ఆమే.. చీఫ్ డిజైనర్ రామ్ కృపా అనంతన్.
థార్ అంటేనే ఒక వైబ్రేషన్. SUVల్లో కొత్త ఎత్తులను చేర్చిన బండి. ఈ కారు కోసం వెయిటింగ్ కూడా ఎక్కువే ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఉన్న థార్ తో పోలిస్తే 2 జెన్ మోడల్ మరింత కొత్తగా ముస్తాబై వచ్చేసింది. దీన్ని ఇంత అందంగా డిజైన్ చేసింది కృపా అనంతన్, ఆమె అసలు పేరు రామ్ కృపా అనంతన్.
మరిన్ని ఉత్పత్తులకు..
ఆటోమోటివ్ పరిశ్రమలో అనంతన్ అంటే తెలియనివారుండరు. ఆమె మహీంద్రా SUV విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సహాయపడింది. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ డిజైన్ హెడ్ పని చేస్తున్న అనంతన్.. మహీంద్రా థార్, మహీంద్రా XUV 700, మహీంద్రా స్కార్పియో అనే మూడు మహీంద్రా ఉత్పత్తులకు చీఫ్ డిజైనర్ గా పని చేశారు.
ఐఐటీలో..
రామకృపా అనంతన్ బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఆమె ఐఐటీ బాంబే నుంచి మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ ను పూర్తి చేసింది. ఆ తర్వాత 1997లో మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ లో డిజైనర్ గా తన వృత్తిని ప్రారంభించింది. 2005లో డిజైన్ హెడ్ గా నియమితురాలైంది. ఆ సమయంలోనే మహీంద్రా XUV 500 SUVని డిజైన్ చేసింది. దీంతో పాటు XUV 700, స్కార్పియో డిజైన్ చేసిన వారిలో ఉన్నది. 2019లో మహీంద్రా చీఫ్ డిజైన్ అయింది అనంతన్. ప్రస్తుతం ఆమె సొంతంగా KRUX స్టూడియో స్థాపించింది.
KRUX స్టూడియో స్థాపించిన తర్వాత అనంతన్ మరిన్ని ప్రాజెక్ట్స్ ల్లో భాగమైంది. ఆమె సొంతంగా Two2 అనే మైక్రో మొబిలిటీ కాన్సెప్ట్ ఉన్న వాహనాన్ని ఆవిష్కరించింది. అది అప్ సైకిల్ భాగాలను ఉపయోగించి రూపొందించింది. అనంతన్ తన సొంత పనులే కాదు.. ఓలా ఎలక్ట్రిక్ డిజైన్ హెడ్ గా కూడా చేరారు. ప్రస్తుతం ఆమె ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ బైక్ మీద పని చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఆమె సహకారం ఉంటే మరింత ముందుకు వెళ్తామని ఓలా సంస్థ కూడా ప్రకటించింది.