చాయ్‌వాలా నుంచి చౌకీదార్‌గా మోదీ.. - MicTv.in - Telugu News
mictv telugu

చాయ్‌వాలా నుంచి చౌకీదార్‌గా మోదీ..

March 17, 2019

ప్రధాని నరేంద్రమోదీని ప్రతిపక్షాలు చాయ్‌వాలా చాయ్‌వాలా.. అని సంబోధించాయి. అప్పుడాయన వారి మాటలకు ఫీల్ అవకుండా చాయ్ పే చర్చా అని ప్రచారం చేసుకున్నారు. దానికి అప్పట్లో విపరీతంగా స్పందన లభించింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రతిపక్షాలు చౌకీదార్ అని ఎద్దేవా చేస్తుండటంతో మోదీ దానిని కూడా తనకు అనువుగా మార్చుకుంటున్నారు. ‘మై భీ చౌకీదార్‌’ పేరుతో ప్రచారం ప్రారంభించారు. దేశంలోని అవినీతి, సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు తన మాదిరిగానే ఎందరో పోరాడుతున్నారని, ఈ లక్ష్య సాధనలో తాను ఒంటరివాడిని కాదని మోదీ తెలిపారు.

 

సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని శనివారం ఆయన ‘నేనూ కాపలాదారునే’ అనే బీజేపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘మీ కాపలాదారు దృఢంగా నిలబడి దేశానికి సేవ చేస్తున్నారు. ఈ కృషిలో నేను ఒంటరిని కాను. అవినీతి, సామాజిక రుగ్మతలు, అపరిశుభ్రతపై పోరాడే ప్రతిఒక్కరూ కాపలాదారులే. దేశ ప్రగతి కోసం శ్రమించే వారందరూ చౌకీదారులే. నేడు దేశంలో ప్రతి ఒక్కరూ ‘నేనూ కాపలాదారునే’ అని నినదిస్తున్నారు’ అని ట్వీట్‌ చేశారు. దీనికి మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియోను కూడా జత చేశారు.

తాజాగా ఆయన వ్యక్తిగత ట్విటర్‌ ఖాతా పేరును ‘ప్రధాని నరేంద్ర మోదీ’ నుంచి చౌకీదార్‌ నరేంద్ర మోదీగా మార్చుకున్నారు. దీంతో ఆయన బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కూడా తమ పేర్లకు మందు చౌకీదార్‌ను చేర్చుకుంటున్నారు. ‘చౌకీదార్ అమిత్‌షా’, ‘చౌకీదార్ పీయూష్‌ గోయల్‌’గా ఇప్పటికే చపేర్లు మార్చుకున్నారు. కేంద్ర మంత్రి నడ్డా కూడా ఈజాబితాలో చేరారు. ‘మై భీ చౌకీదార్‌’పేరుతో ట్విటర్‌లో ఇప్పటికే ఒక హ్యాష్‌ట్యాగ్‌ను కూడా మోదీ ప్రారంభించారు.