కశ్మీర్‌లో మళ్లీ ఉగ్ర పేలుడు, మేజర్ బలి - MicTv.in - Telugu News
mictv telugu

కశ్మీర్‌లో మళ్లీ ఉగ్ర పేలుడు, మేజర్ బలి

February 16, 2019

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పుల్వామాలో 49 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకుని రెండు రోజులు తిరగకముందే సరిహద్దులో మళ్లీ ఘాతుకానికి తెగబడ్డాయి. కశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్‌లో ఈ రోజు ముష్కర మూకలు పాతిపెట్టిన శక్తిమంతమైన బాంబు పేలడంతో భారత ఆర్మీ మేజర్ ఒకరు చనిపోయారు. ఐదు రోజుల కింద ఇదే ప్రాంతంలో పాక్ రేంజర్లు దాడి చేసి, ముగ్గురు జవాన్లను చంపేశారు.

Major Killed in IED Blast Near LoC in Nowshera Sector Two Days After Kashmir Pulwama Attack.

పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని, ఉగ్రస్థాన్‌గా మారిన పాకిస్తాన్‌ను ప్రపంచంలో ఒంటరి చేస్తామని భారత ప్రధాని మోదీ, ఇతర నాయకులు ప్రకటించిన నేపథ్యంలో పాక్ ఉగ్రమూకలు తాజా దుశ్చర్యకు పాల్పడ్డాయి.  వాస్తవాధీన రేఖ వద్ద పాక్ రేజంర్లు పడేసిన బాంబును నిర్వీర్యం చేస్తుండగా ఆర్మీ మేజర్ మృతిచెందినట్లు తెలుస్తోంది. పుల్వామా దాడి నేపథ్యంలో భారత సైన్యం సరిహద్దులో మరింత అప్రమత్తంగా ఉంటోంది. దీంతో ఏ క్షణంలోనైనా తమపై ప్రతీకార దాడులు జరుగుతాయనే భయంతో పాకిస్తాన్ వణుకుతోంది. కశ్మీర్ సరిహద్దును నిత్యం రక్తసిక్తం చేస్తూ అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్లే ఎత్తుగడలో భాగంగా కాల్పులు, బాంబు పేలుళ్లకు తెగబడుతోంది.