వింబుల్డన్‌ రద్దు..75 ఏండ్ల తర్వాత తొలిసారి - MicTv.in - Telugu News
mictv telugu

వింబుల్డన్‌ రద్దు..75 ఏండ్ల తర్వాత తొలిసారి

June 29, 2020

Wimbledon

కరోనా వైరస్‌ దెబ్బకి ఇప్పటికే ఎన్నో మెగా స్పోర్ట్స్ టోర్నీలు రద్దైన సంగతి తెల్సిందే. టోక్యో ఒలింపిక్స్, ఐపీఎల్ మొదలగు టోర్నీలు రద్దైన సంగతి తెల్సిందే. తాజాగా యూరోప్‌లో ఈరోజు నుంచి ప్రారంభం కావాల్సిన వింబుల్డన్ టోర్నీకూడా రద్దయింది. 144 ఏండ్ల చరిత్ర ఉన్న వింబుల్డన్‌ గత 75 ఏండ్లలో వింబుల్డన్ టోర్నీ రద్దు కావడం ఇదే తొలిసారి. షెడ్యూల్‌ ప్రకారం ఈ టోర్నీ సోమవారం జూన్‌ 29 నుంచి వచ్చే నెల 12 వరకు జరగాల్సి ఉంది. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిర్వాహకులు ఈ టోర్నీని రద్దు చేశారు.

టోర్నమెంట్ రద్దు కారణంగా నిర్వాహకులకు సుమారు రూ.2,400 కోట్ల నష్టం వాటిల్లుతుందని తెలుస్తోంది. వింబుల్డన్‌ పోటీలకు నిర్వాహకులు సుమారు రూ.950 కోట్ల బీమా చేయడంతో.. ఇప్పుడు ఈ నష్టం సుమారు రూ.1,450 కోట్లుగా ఉండనున్నది. వింబుల్డన్‌ పోటీలను తొలిసారి 1877లో నిర్వహించారు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1915 నుంచి 1918 వరకు, రెండో ప్రపంచ యుద్ధం వల్ల 1940 నుంచి 1945 వరకు టోర్నీని రద్దు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వింబుల్డన్‌ రద్దు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.